మూడు దశాబ్దాల వివాదానికి శాశ్వత పరిష్కారం

Congress leader Vijayashanti

Hyderabad: మూడు దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి వెల్లడించారు. సుప్రీం తీర్పుపై పేస్ బుక్ ద్వారా స్పందించిన విజయశాంతి ఉభయ తారకంగా ఉన్న సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని.. రాజకీయాలకతీతంగా ఈ అంశాన్ని చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కీలక తరుణంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, శాంతిని, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు దేశంలోని ప్రతి పౌరుడు తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమయిందని భాషలు, ప్రాంతాలు,మతాలు వేరైనా అందరం భారతీయులం అనే సంకల్పంతో ముందుకు నడుద్దాం భారతీయ సంస్కృతిని కాపాడుదామని తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/