రెండువేల టెస్టులు చేసే సామర్థ్యం ఉన్న ల్యాబ్‌

హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఏర్పాటు

kishan reddy
kishan reddy

హైదరాబాద్‌: దేశంలో తొలి మొబైల్‌ వైరాలజి ల్యాబ్‌ను నేడు హైదరాబాద్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, కిషన్‌ రెడ్డి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర హోం శాఖ సహయమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతు రెండువేల టెస్టులు చేసే సామర్థ్యం ఈ ల్యాబ్‌కి ఉందన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి ఈ ల్యాబ్‌ ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా లక్షా 86 వేల కోవిడ్‌ బెడ్లతోపాటు, 24 వేల ఐసీయూ బెడ్లను కూడా ఏర్పాటు చేశామని, అలాగే ప్రైవేటు కంపెనీల సహయంతో వెంటి లెటర్లు తయారు చేయిస్తున్నామని వెల్లడించారు. కరోనా ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, అందు కలిసి కట్టుగా కరోనాను ఎదుర్కోవాలనలి పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/