యువతిపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌ అరెస్ట్

కానిస్టేబుల్‌ మోసం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు

constable arrested
constable arrested

హైదరాబాద్‌: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువతిపై అత్యాచారానికి పాల్పడిన కానిస్టేబుల్‌ను మలక్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బడంగ్‌పేట నివాసి ఎ.శివకుమార్‌ (24) ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. జనవరి 11న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. శివకుమార్‌ ఈ విషయం ఆమెకు చెప్పి తనను మర్చిపోవాలని బెదిరించాడు. కానిస్టేబుల్‌ తనను మోసం చేశాడంటూ బాధితురాలు మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి పరారీలో ఉన్న శివకుమార్‌ను గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/