టిఆర్‌ఎస్‌లో 60 లక్షల మంది సభ్యులు చేరిక

Palla Rajeshwar Reddy
Palla Rajeshwar Reddy

హైదరాబాద్: టిఆర్‌ఎస్‌లో 60 లక్షల మంది సభ్యులుగా చేరారని ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. టిఆర్ఎస్ భవనం నుంచి పల్లా మీడియాతో మాట్లాడారు. మొత్తం సభ్యుల్లో 20 లక్షల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారని, క్రియాశీల సభ్యులందరికీ పార్టీ గుర్తింపు కార్డులు ఇస్తామని వివరించారు. సభ్యత్వ నమోదులో గజ్వేల్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, 50 లక్షల సభ్యత్వాలకు డేటా ఎంట్రీ ముగిసిందని వెల్లడించారు. గ్రామాల్లో గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఈ నెల 31 వరకు నియమించాలని నిర్ణయించామని పల్లా పేర్కొన్నారు. ఈ నెల 25 కల్లా సభ్యత్వ పుస్తకాలు పార్టీ ఆఫీస్‌కు చేరాలన్నారు. దసరాలోగా 30 జిల్లాల్లో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దసరా రోజున పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/