53 మంది సిఐలకు డిఎస్‌పిలుగా పదోన్నతి

DGP Mahender Reddy
DGP Mahender Reddy

హైదరాబాద్ : రాష్ట్రంలో 53మంది సిఐలకు డిఎస్‌పిలుగా పదోన్నతి కల్పించినట్లు రాష్ట డిజిపి మహేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో అత్యధికంగా 1995, 1996, బ్యాచ్ చెందినవారున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ కింద 1998 తదితర బ్యాచ్‌లకు చెందినవారున్నారు. కాగా సిఐ నుంచి డిఎస్‌పిలుగా పదోన్నతితో పాటు బదలీలు చేయడం జరిగింది. పదోన్నతి పొందిన పోలీసు అధికారులు 15 రోజుల్లోగా తమ విధులలో చేరాలని డిజిపి ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/