రామగుండం పరిధిలో రేషన్‌ బియ్యం పట్టివేత

ration rice
ration rice

పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండటాన్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. సుమారు రూ. 11 లక్షల విలువైన 500 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. రేషన్‌ బియ్యం తరలిస్తున్న రెండు లారీలు, రెండు మినీ వ్యాన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/