5వేల ఎకరాల వరిపంటకు నష్టం

Jeewan reddy
Jeewan reddy

జగిత్యాల: దోమపోటుతో పంటనష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాగా, ఈ రోజు ఆయన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం మూటపల్లిలో దోమకాటుకు గురైన వరిపంటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో దోమపోటుతో 5వేల ఎకరాల వరిపంటకు నష్టం కలిగిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఉచిత విద్యుత్‌తో రైతులకు లాభమేమి జరగటం లేదని విమర్శించారు.