వేములవాడలో ఘోర ప్రమాదం

Three schoolchildren killed in road accident
Three schoolchildren killed in road accident

వేములవాడ రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ శి వారులో బుధవారం వాగేశ్వరి స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినులు అక్కడిక్కడే మృతి చెంద గా, మరో విద్యార్థి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇరవై మంది విద్యార్థులకు తీవ్రగాయాలైయ్యా యి.

స్థానికుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వాగేశ్వరి శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్‌కి చెందిన విద్యార్థులు మధ్యాహ్న భోజనం కో సం చింతల్‌ఠాణా (ఆర్‌అండ్‌ఆర్ కాలనీ)లో గల హాస్టల్‌కు భో జనం కోసం వెళ్లిరావడం పరిపాటిగా మారింది. బుధవారం ఎ ప్పటిలాగే బస్సులో 27 మంది విద్యార్థులను తీసుకొని భోజనానికి వెళ్తుండగా డ్రైవర్ ఎండి.రఫీక్ స్కూల్ బస్సు అతివేగంతో న డుపుతూ డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడి ంది. డోర్ వద్ద కూర్చున్న వట్టెంల గ్రామానికి చెందిన కాసారం మణిచందన రాణి(15), బడితండా మానాలకు చెందిన గుగులోతు దీక్షిత(08) బస్సులోనుంచి జారి పడడంతో, బస్సు వారి పైన పడింది. దీంతో వారు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన విద్యార్థి గుగులోతు రుషిక్(07) అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. సంఘటన స్థలం వద్ద ఉన్న స్థానికులు పెద్ద ఎత్తున హుటాహుటినా బోల్తాపడిన బస్సు వద్దకు వచ్చి లేవనెత్తారు. సంఘటన స్థలానికి స్థానిక డిఎస్‌పి వెంకటరమణ, సిఐ వెంకటస్వామి చేరుకుని, గాయాలైన చిన్నారులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వాహనాలలో తరలించారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/