26 మంది ట్రాఫిక్‌ సిబ్బందికి అవార్డులు

traffic police
traffic police

హైదరాబాద్‌: విధి నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పనిచేసిన 26 మంది ట్రాఫిక్‌ సిబ్బందికి సి టీ ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ శనివారం అవార్డులు అందజేశారు. ట్రాఫిక్‌ కాంప్లెక్స్‌్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరందరికి ఆ యన ఈ అవార్డులు ప్రధానం చేశారు. 2018 ఏడాదికిగానూ వీరికి ఈ అవార్డులు దక్కాయి. జంక్షన్లలో విధులు నిర్వహించిన వీ రు రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రయాణీకులు మరచిపోయిన విలువైన వస్తువలను వారికి అందించారు. అవార్డులు లభించిన వారిలో ఎస్‌ఐ నుంచి కానిస్టేబుల్‌, హోంగార్డులు వున్నారు. ఈ సందర్భంగా డిసిపి చౌహాన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.