20న రాహుల్‌గాంధీ పర్యటన: భట్టి విక్రమార్క

Bhatti
Bhatti

20న రాహుల్‌గాంధీ పర్యటన: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీ పాల్గొంటారని, 20న రాహుల్‌గాంధీ పర్యటన నిమిత్తం ఆపినట్లు తెలిపినట్లు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20న ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో త్వరలో రాహుల్‌గాంధీ పాల్గొంటారని, ఈనేపథ్యంలో పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్ల తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు హైదరాబాద్‌ ఉండాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ప్రకటించిన ప్రచార కార్యక్రమాలలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. త్వరలోనే మారిన ఎన్నికల ప్రచార సభల వివరాలను ప్రకటిస్తామన్నారు. తాత్కాలికంగానే ఎన్నికల ప్రచారాలు ఆగాయన్నారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన దృష్ట్యా తాత్కాలికంగా ప్రచారం చేయడంలేదన్నారు.