భారీగా గంజాయి పట్టివేత

cannabis
cannabis

హైదరాబాద్‌: డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌(డిఆర్‌ఐ) అధికారులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. 944.7 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఎల్బీనగర్‌ పరిధిలో అధికారులు గుర్తించి పట్టుకున్నారు. చిన్న చిన్న పొట్లాలు కట్టి కొబ్బరికాయల లోడ్‌లో తరలిస్తున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.1.88 కోట్ల విలువ చేస్తుందని సమాచారం. భద్రాచలం నుంచి సంగారెడ్డి వైపు తరలిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/