డివైడర్‌ను ఢీకొన్న పోలీస్‌ వాహనం

అతివేగమే ప్రమాదానికి కారణం.. ఇద్దరికి గాయాలు

Accident at Gachibowli
Accident at Gachibowli

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో పోలీసు పెట్రోలింగ్‌ కారుకు ప్రమాదం జరిగింది. పెట్రోలింగ్‌లో ఉన్న కారు అతివేగం కారణంగా అదుపు తప్పి గచ్చిబౌలి స్టేడియం వద్ద డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. వాహనంలోని ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి, క్రేన్‌ సహాయంతో వాహనాన్ని తొలగించారు. గాయపడిన కానిస్టేబుళ్లను సమీపంలోని ఆస్పుత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి గురైన పెట్రోలింగ్‌ కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/