తెలంగాణలో ఆరు నెలల పాటు 13 ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

నిర్వహణా పనుల కారణంగానేనని వెల్లడి

train
train

హైదరాబాద్‌: జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ పలు మార్గాల్లో తిరిగే డెము రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిర్వహణా పనులు, భద్రత కారణంగా 13 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఎస్సీఆర్ అధికారి సీహెచ్ రాకేశ్ వెల్లడించారు. రద్దయిన రైళ్లను పరిశీలిస్తే, సికింద్రాబాద్‌ మేడ్చల్‌ సికింద్రాబాద్‌ డెము ప్యాసింజర్‌, ఫలక్‌ నుమా మేడ్చల్‌ ఫలక్‌నుమా డెము ప్యాసింజర్‌ , ఫలక్‌ నుమా ఉమ్దా నగర్‌ ఫలక్‌ నుమా డెము ప్యాసింజర్‌ , , బొల్లారం ఫలక్‌ నుమా బొల్లారం డెము ప్యాసింజర్‌ రద్దయిన రైళ్లలో ఉన్నాయి.

వీటితో పాటు ఫలక్‌ నుమా మనోహరాబాద్‌ సికింద్రాబాద్‌ డెము ప్యాసింజర్‌ , సికింద్రాబాద్‌ ఉమ్దా నగర్‌ డెము ప్యాసింజర్‌ , ఉమ్దా నగర్‌ ఫలక్‌ నుమా ఉమ్దా నగర్‌ డెము ప్యాసింజర్‌, ఫలక్‌ నుమా భువనగరి ఫలక్‌ నుమా ప్యాసింజర్‌ రైళ్లు ఆరు నెలల పాటు తిరగవు. ఇదే సమయంలో కొన్ని రైళ్లను పాక్షికంగానూ రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి మార్చి 15 వరకూ బోధన్‌ మహబూబ్‌ నగర్‌ ప్యాసింజర్‌ షాద్ నగర్ వరకు మాత్రమే నడుస్తుంది. మహబూబ్‌ నగర్‌ కాచిగూడ ప్యాసింజర్‌ రైలు కూడా షాద్‌ నగర్‌ వరకే పరిమితం కానుంది. మేడ్చల్‌ కాచిగూడ ప్యాసింజర్‌ ను మేడ్చల్, బొల్లారం మధ్య రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/