హైద‌రాబాద్ న‌గ‌రంలో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు!

Traffic Police
Traffic Police

హైదరాబాద్‌: జీఈఎస్‌ ప్రతినిధులకు రేపు గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. దీనికి ప్ర‌ముఖుల రాక సంద‌ర్భంగా గోల్కొండకోట పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు పోలీసులు ప్రకటించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటలకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. నార్సింగి, బాపూఘాట్‌, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్‌, ఫతే దర్వాజ, షేక్‌పేట్‌ నాలా, జమాలి దర్వాజ మార్గాల్లో వాహనాలు వెళ్లాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రవీందర్‌ సూచించారు.