నల్గొండ యువకుడికి రూ.1.50 కోట్ల వేతనం

Microsoft
Microsoft

నల్గొండ: ముంబయి ఐఐటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న నల్గొండ జిల్లాకు చెందిన చింతరెడ్డి సాయిచరిత్‌ రెడ్డికి ఏడాదికి రూ. 1.54 కోట్ల వేతనాన్ని ప్రముఖ ఐటీ, సాఫ్ట్ వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. ఇటీవల ఐఐటీలో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ జరుగగా, ముగ్గురికి ఇంత భారీ ఆఫర్ లభించింది. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకుడు సాయిచరిత్ ఒక్కడే కావడం గమనార్హం. తమ కుమారుడికి మైక్రోసాఫ్ట్ లో ఇంత మంచి ఆఫర్ రావడంపై సాయి చరిత్ తల్లిదండ్రులు సైదిరెడ్డి, సీత ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి సాయి చరిత్ ఎంతో కష్టపడి చదివాడని, ఇప్పటికి ఫలితం దక్కిందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/