ప్రజా రవాణా వ్యవస్థలో మార్పులు!

స్టాండింగ్‌ జర్నీకి చెక్‌ పెట్టే యోచనలో అధికారులు

city bus
city bus

హైదరాబాద్‌: కరోనా మహామ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ, మెట్రో వంటి రవాణా సేవలు లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో నష్టపోయాయి. దీంతో త్వరలోనే ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్దరించాలని ప్రభుత్వం భావిస్తుంది. రవాణా వ్యవస్థను పునరుద్దరించినట్లయితే ఇకపై సిటీ బస్సుల్లో స్టాండిగ్‌ జర్నికి చెక్‌ పెట్టే యోచనలో అధికారులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలి కావున ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరు, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరికి అనుమతినివ్వనున్నారు. ఇక మెట్రోలో 900 మంది ప్రయాణించే వీలుండగా.. ఇకపై కొద్దిమందితోనే రైళ్లను నడపాలని భావిస్తున్నారు. ప్రయాణికులు నిల్చునేందుకు వీలుగా తెలుపు రంగు సర్కిళ్లు ఏర్పాటు చేయాలని, స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయాలని భావిస్తున్నారు. ప్రయాణికులకు మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/