హైకోర్టులో ముందస్తు ఎన్నికలపై పిటిషన్‌ కొట్టివేత

High court
High court

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలపై ౖ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఓటర్ల సవరణకు గడువు తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈవిషయంపై ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్‌కు విశేష అధికారాలుంటాయని, ఎన్నికలు ఎలా నిర్వహించాలో ఈసీ చూసుకుంటుందని ధర్మాసనం తెలిపింది. కాగా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంల పిటిషన్‌ వేస్తామని పిటిషనర్‌ చెప్పారు.