హైకోర్టులో కోమ‌టిరెడ్డికి ఊర‌ట‌

Komati reddy venkat reddy
Komati reddy venkat reddy

హైద‌రాబాద్ః కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి విద్యార్హతలపై దుబ్బాక నరసింహారెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ నరసింహారెడ్డికి, భూపాల్‌రెడ్డికి చెరో రూ.25వేల జరిమానాను విధించింది. కోమటిరెడ్డి విద్యార్హతలపై హైకోర్టులో మూడేళ్లుగా వాదనలు నడుస్తున్న విషయం తెలిసిందే. కోమటిరెడ్డికి ఊరటనిస్తూ, పిటిషన్‌దారులకు కోర్టు అక్షింతలు వేయడంతో ఈ కేసు ఇక్కడితో ముగిసినట్లైంది.