హెచ్ఎండిఏ అధికారి ఇంట్లో ఏసిబి దాడులు

acb rides
acb rides

హైద‌రాబాద్ః హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం అధికారి భీంరావ్ నివాసంలో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి శేరిలింగంపల్లిలోని భీంరావ్ నివాసంలో తనిఖీలు చేస్తూనే ఉన్నారు. హెచ్‌ఎండీఏ పూర్వ ప్రణాళికా విభాగం అధికారి పురుషోత్తంరెడ్డితో కలిసి భీంరావ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేస్తున్నారు.