హిందుత్వ పరిరక్షణ కోసమే బిజెపి నిర్మితమైంది

RAJA SINGH
RAJA SINGH

హైదరాబాద్‌: ఆవు మాంసం తినే వాళ్ల ఓటు తనకు అవసరం లేదని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ పరిరక్షణ కోసమే బిజెపి నిర్మాణమైందని చెప్పారు. హిందువులు ఎక్కడెక్కడ గెలిచేవాళ్లున్నారో పార్టీ గుర్తింస్తుందని తెలిపారు. ఎంఐఎం వాళ్లు ప్రచారం చేసే చోటే తనను ప్రచారం చేయమని పార్టీ ఆదేశించిందని తెలిపారు. తాను అందుకు సిద్ధమని అమిత్‌ షాకు చెప్పానని వెల్లడించారు. పార్టీ ఎక్కడ్నుంచి పోటీ చేయమంటే అక్కడ్నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు హిందువులు ఓటు వేస్తే చాలని రాజాసింగ్‌ ప్రకటించారు.