హంగ్‌ వస్తే గవర్నర్‌ నిర్ణయమే ఫైనల్‌!

political parties
political parties

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని పక్షంలో పోలింగ్‌కు ముందే పొత్తు కుదుర్చుకున్న ప్రజాకూటమికి ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే వారినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. హంగ్‌ గనుక వస్తే గవర్నర్‌ ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న చర్చ జరుగుతుంది. ఈ అంశంపై గతంలోనే సుప్రీం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్న కూటమికే అవకాశం ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది.