స్పోర్ట్స్ మీట్‌కు మంత్రి పోచారం

Pocharam Srinivas Reddy
Pocharam Srinivas Reddy

రంగారెడ్డిః శంషాబాద్ మండలం నర్కుడలో వ్యవసాయ అధికారుల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో మూడు రోజులపాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.