సొరంగ మృతుల కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం

JUPALLIFFFF
Jupalli Krushna rao

నాగర్‌కర్నూల్‌: కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20లక్షలను పరిహారంగా
అందించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సొరంగం పనుల కోసం కూలీలతో వెళ్తుండగా ఉదయం టిప్పర్‌
బోల్తాపడిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 10మంది కూలీలు గాయపడ్డారు. గాయాలైన వారిని చికిత్స కోసం హైదరబాద్‌
గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. గాయపడిన వారిని
మంత్రి జూపల్లి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు అదే విధంగా మరో 10లక్షల భీమా చర్యలు తీసుకున్నట్లు
వెల్లడించారు. గాయపడ్డ కూలీలకు వైద్య ఖర్చులతో పాటు రూ.2లక్షలు చెల్లించాలని గుత్తేదారుని మంత్రి ఆదేశించారు.