సెర్ఫ్‌ ఉద్యోగులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేస్తుంది: సండ్ర

Sandra Venkata veeraiah
Sandra Venkata veeraiah

హైదరాబాద్‌: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 4,264 ఉద్యోగులను పోలీసులు ఎక్కడిక్కడే అరెస్ట్‌  టిడపి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ ఛలో అసెంబ్లీకి పిలుపినిచ్చిన సెర్ఫ్‌ ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, మహిళలను కూండా రాత్రి ఠాణాలో నిర్బంధించారిన ఆరోపించారు. సెర్ఫ్‌ ఉద్యోగులకు జీవో 174 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వారు పక్షం రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. వారి ఆందోళనతో గ్రామాల్లో ధాన్యం కోనుగోళ్లు ఆగిపోయే పరిస్థితి నెలకొందన్నారు.