సికింద్రాబాద్‌ లోక్‌సభకు ఉప ఎన్నిక?

B.Dattatreya
B.Dattatreya

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న నేపథ్యంలో దత్తాత్రేయ తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. దత్తన్నను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపనున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే తాను ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. అటు తర్వాత బిజెపిలో సీనియర్లను రంగంలోకి దించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ పూర్తి ఐతే గాని వీటన్నింటి మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.