సింగరేణిలో కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

Singareni
Singareni

భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణిలో కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటనున సీఎం కెసిఆర్‌ నిలబెట్టుకున్నారు. సింగరేణి కారుణ్య నియామకాలను చేపట్టాలని సింగరేణి బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యంతో బాధపుడుతోన్న కార్మికులకు, మరణించిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు వరంగా మారాయి. కారుణ్య నియామకాల ఉత్తర్వులు జారీ కావడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్‌,ఎంపీ కవితకు ఈ సందర్భంగా సింగరేణి కార్మికులంతా కృతజ్ఞతలు తెలియచేశారు.