సగం పెట్రోల్‌… సగం నీళ్లు

PETROL1
PETROL

వరంగల్‌: వరంగల్‌ పట్టణంలోని పావని పెట్రోల్‌బంక్‌లో వాహనాల్లో పెట్రోల్‌ పోస్తుండగా అనుమానం వచ్చిన వినియోగదారులు తమ ద్విచక్రవాహన ట్యాంకు పైపులను తీసి కిందపోయగా పెట్రోలు నీటిరంగులో రావండంతో ఆశ్చర్యపోయారు. విషయం బయటకు పోకుండా ఉండేందుకు వినియోగదారులకు డబ్బులను తిరిగి ఇచ్చి పంపించారు.కొందరు వినియోగదారులు బాటిళ్లలో సైతం ప్రెటోల్‌ పోసిచూడగా సగం పెట్రోల్‌, సగం నీరు ఉందని ఇలాంటి పెట్రోల్‌ పోస్తే తమ వాహనాల పరిస్థి ఏంటని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారలు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు.