సంగారెడ్డిలో గంజాయి పట్టివేత

Ganja
Ganja

సంగారెడ్డి: జిల్లాలో 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నగల్‌గిడ్డాలో కారులో 100 సంచుల్లో అక్రమంగా తరలిస్తున్న 200కిలోల
గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అనంతరం గంజాయిని తరలిస్తున్న వ్యక్తులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.