శ్రీవారి సన్నిధిలో మంత్రి తలసాని

T. Srinivas yadav
T. Srinivas yadav

తిరుమల: ఈ రోజు తెలంగాణ పశసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నాం కళ్యాణోత్సవ విరామ సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులు వేదశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తలసాని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురిసి పాడి పంటలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.