శిక్షణా సదస్సులో మాట్లాడుతున్న లక్ష్మణ్‌

laxman
laxman

విద్యానగర్‌ : మహిళ సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ సూచించారు. రాంనగర్‌ జెమిని కాలనీలో మహిళా సాధికార సంస్థ ఏర్పాటు చేసిన కుట్టుశిక్షణా కేంద్రాన్ని లక్ష్మణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధితోనే సమాజ ప్రగతి ముడిపడి ఉందన్నారు. ఈ దిశగానే ప్రధాని నరేంద్రమోడీ అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని, ప్రత్యేక శిక్షణా సదస్సులు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాయితీలు, సంక్షేమ పథకాలతో స్వయం సమృద్ధి సాధించాలని, కుటీరపరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అర్హులకు ముద్రరుణాలు అందించేందుకు తోడ్పాటునందించాలని బిజెపి కార్యకర్తలకు లక్ష్మణ్‌ సూచించారు. సాధికార సంస్థ ప్రతినిధులు ప్రసన్న, పల్లవి, గీత, బిజెపి నాయకులు మద్దూరి శివాజి, కలకోట అరుణ్‌, డి. లక్ష్మణ్‌, నర్సింగ్‌రావు, శక్తి కాలని అధ్యక్షుడు దేవేందర్‌, శంకర్‌ , దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.