శాసనసభ కోటా మండలి స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ కోటా మండలి స్ధానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. శాసన సభ కోటాలో ఎన్నికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, టి.సంతోష్‌ కుమార్‌, మహ్మద్‌ సలీం, మహమూద్‌ అలీ పదవీకాలం పూర్తికానుండటంతో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.ఈరోజు నుండి ఈనెల 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తం ఐదు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 12వ తేదీన పోలింగ్‌ నిర్వహించి అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాన్ని వెల్లడిస్తారు. నేటి నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 1వ తేదీ వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. 5వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు.