శారదాపీఠం వార్షికోత్సవాలకు కేసిఆర్‌!

kcr, telangana cm
kcr, telangana cm

హైదరాబాద్‌: సియం కేసిఆర్‌ మరోసారి ఏపికి వెళ్లనున్నారు. వచ్చే నెల 10న విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలోల కేసిఆర్‌ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసిఆర్‌ హాజరుకానున్నారు. ఎర్రవల్లిలో ఐదు రోజుల పాటు సహస్ర చండీయాగాన్ని కేసిఆర్‌ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి యాగానికి హాజరయ్యారు. ఆ సమయంలోనే శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాల్సిందిగా కేసిఆర్‌ను స్వరూపానంద స్వామి ఆహ్వానించినట్లు తెలుస్తుంది.