వైష్ణో దేవి యాత్ర నిలిపివేత

VAISHNO DEVI TEMPLE
VAISHNO DEVI TEMPLE

జమ్మూ: వైష్ణో దేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. శుక్రవారం భారీ స్థాయిలో భక్తులు పోటెత్తడంతో ఇవాళ ఆ యాత్రకు బ్రేకేశారు. కట్రా బేస్‌ నుంచి వస్తున్న భక్తులను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు సమాచారం. భక్తుల తాకిడి అధికంగా ఉందని ,నిన్న రాత్రి 8 గంటలకు టికెట్‌ కౌంటర్‌ను మూయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మాతా వైష్ణో దేవి దర్శనం కోసం సుమారు 41 వేల మంది భక్తులు వేచి ఉన్నారని సమాచారం. సగటున ప్రతి రోజు 40 వేల మంది భక్తులు ఆలయనికి వస్తున్నట్లు అంచనా.