విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు లైన్‌ క్లియర్‌

TS ELECTRICITY
TS ELECTRICITY

 

విద్యుత్‌ శాఖలో ఏళ్ల తరబడి ఔట్‌ సోర్సింగ్‌ విధానంపై పనిచేస్తున్న కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న సుమారు 20,094 మందిని క్రమబద్ధీకరించేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. విద్యుత్‌ శాఖ కార్మికుల
దస్త్రంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ సంతకం చేశారు. ఈ దస్త్రాన్ని సిఎం ఆమోదించేందుకు ముఖ్యమంత్రి ఛాంబర్‌కు
చేరింది. సీఎం సంతకం చేసిన వెంటనే విద్యుత్‌ శాఖలో క్రమబద్దీకరణపై ఆదేశాలు జారీ చేయనున్నారు.