విద్యుత్‌సౌధ ముందు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళన

TVKS
TVKS

హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ విద్యుత్‌ ఒప్పంద ఉద్యోగుల యూనియన్‌ విద్యుత్‌సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విద్యుత్‌సౌధ ముందు ఆందోళనకు దిగారు. పంజాగుట్ట డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌కుమార్‌ నేతృత్వంలోని ఆందోళనకు దిగిన 200మందిని అరెస్ట్‌ చేశారు. ఆందోళన నేపథ్యంలో ఖైరతాబాద్‌ విద్యుత్‌ సౌధవద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా తెలంగాణ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బంది(అర్జిజెన్స్‌)ని వెంటనే పర్మినెంట్‌ చేయాలని,వారికి పేస్కేల్స్‌విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2017 జులైలో 24వేల మంది విద్యుత్‌ ఒప్పంద కార్మికులను విలీనం చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు పేస్కేల్‌ అమలు చేయలేదని తెలిపారు.ఈనేపథ్యంలో ఆర్జీనెన్స్‌విద్యుత్‌ సౌధముట్టడికి పిలుపునిచ్చిన ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు.