విద్యార్థులకు హెల్త్‌ కార్డులు

TS DEPTU CM KADIYAM
TS DEPTU CM KADIYAM

విద్యార్థులకు హెల్త్‌ కార్డులు

జులై నుంచి ఆరోగ్య పరీక్షలు అమలు 6నెలల్లో పూర్తి
విద్యార్థినులకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన తరగతులు,
మహిళా టీచర్లకు శిక్షణ
హెల్త్‌ కిట్స్‌ పంపిణీపై డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి సమీక్ష

హైదరాబాద్‌: రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్‌కార్లుఉ అందించాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖమంత్రి డా. సి. లక్ష్మారెడ్డిలు నిర్ణయించారు. జులై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి 6 నెలల్లో పూర్తిచేసి హెల్త్‌కార్డులు ఇవ్వాలని అధికారులు సూచించారు.

దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల విద్యాలయాలు, కస్తూ ర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్‌ స్కూల్స్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థినీలందరికీ ఈ హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే కేజీబీవీలు, గురుకుల విద్యాల యాలు, మోడల్‌స్కూళ్లలోని 3 లక్షల మందికి హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ అందిస్తోందని డిప్యూటి సిఎం శ్రీహరి, హెల్త్‌ మినిస్టర్‌ లక్ష్మా రెడ్డిలు తెలిపారు హెల్త్‌ కిట్స్‌లో అందిస్తున్న వస్తువులను కూడా మంత్రి లక్ష్మారెడ్డికి, అక్కడున్న ఆరోగ్యశాఖ అధికారులకు చూపిం చారు.

రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్య, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో ఈ ఆరోగ్య పరీక్షలు జరుపాలని, హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ ఇవ్వాలని బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మంత్రులిద్దరు నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో జులై నెలనుంచి విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు జరుపాలని ఈ సమావేశంలో మంత్రులు కడియం శ్రీమరి, లక్ష్మారె డ్డిలు అధికారులకు ఆదేశాలిచ్చారు. 31 జిల్లాల్లోని ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్‌ విద్యాలయాల్లోని విద్యార్థులందరికీ పరీక్షల చేసి హెల్త్‌కార్డులు అందించాలని చెప్పారు. ఇందుకోసం విద్య, ===