విద్యార్థిని చితక్కొట్టిన ఉపాధ్యాయిని

Teacher Punishment
Teacher Punishment

హైదరాబాద్‌:ఎల్కేజీ విద్యార్థినిని ఓ టీచర్‌ చితక్కొట్టిన ఘటన హైదరాబాద్‌ శివారు పఠాన్‌చెరువులో చోటుచేసుకుంది. తాజాగా ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. తమ కూతురు స్థానికంగా ఉండే మంజీరా ఉన్నత పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. చెప్పిన మాట వినడంలేదనే నెపంతో ఆమెను ఉపాధ్యాయిని వీపువాచేలా కొట్టారని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సదరు ఉపాధ్యాయినిపై ఐపిసి సెక్షన్‌ 324కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామిన పోలీసులు తెలిపారు.