వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా పొత్తు: భట్టి

Bhatti
Bhatti

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసిఆర్‌ పెట్టేది ఫ్రంట్‌ కాదని అది బిజెపి బి టీమ్‌ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహించిన ఘనత టిఆర్‌ఎస్‌దే నన్నారు.ప్రజాస్వామ్య చరిత్రలో బడ్జెట్‌ పెట్టకముందే ప్రతిపక్షాన్ని బహిష్కరించడం ఇదే తొలిసారి అని, సభ నుంచి ఇద్దరిని తొలగించారంటే ప్రభత్వానికి స్పూర్తి లేదనితెలపారు. వచ్చే ఎన్నికల్లో కలిసొచే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.