ర‌హదారి భ‌ద్ర‌త‌పై తుమ్మ‌ల అధ్య‌క్ష‌తన మంత్రి వ‌ర్గ ఉప సంఘం ఏర్పాటు

TUMMALA
TS MINISTER TUMMALA

హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారుల భద్రతను మెరుగుపరిచేందుకు తెలంగాణ సర్కారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జూపల్లి సభ్యులుగా వ్యవహరించనున్నారు. రహదారులపై జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు, భద్రత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలను పరిశీలించి సమగ్ర విధానం రూపొందించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉపసంఘానికి సూచించింది.