రోడ్డు భ‌ద్ర‌త‌పై కెబినెట్ స‌బ్ క‌మిటీ స‌మావేశం

road safty
road safty

హైదరాబాద్: రోడ్డు భద్రతపై కేబినేట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్న చర్యలు.. రోడ్డు ప్రమాదాలు మరింత తగ్గించేందుకు చేపట్టాల్సిన శాఖాపరమైన చర్యలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ప్రజలను మరింత చైతన్యపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సబ్ కమిటీ నిర్ణయించింది. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఇంజినీరింగ్ పరిష్కారాలు సూచించాలని రోడ్డు భవనాల శాఖకు మంత్రుల ఆదేశాలు జారీ చేశారు. తరుచుగా ప్రమాదాలు జరిగే రహదారుల్లో జంక్షన్లను మరింత అభివృద్ధి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల బాధితులకు తక్షణం వైద్య సహకారం అందించేందుకు ఇతర రాష్ర్టాల్లో చేపట్టిన పలు కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.