రోజు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

Sridhar
Sridhar

హైదరాబాద్‌:ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 630లక్షల టన్నుల బొగ్గు ఉత్పిత్తి, 660లక్షల టన్నుల బొగ్గురవానాను లక్ష్యంగా చేసుకొని మిగిలిన 4నెలల కాలంలో ప్రతిరోజు 2లోల బొగ్గు ఉత్పత్తి, 2.10లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏరియా మేనేజర్లను సింగరేణి సిఎండి ఎన్‌.శ్రీధర్‌ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో నెలవారిగా బొగ్గు ఉత్పత్తిపై సిఎండి డైరెక్టర్లు, ఏరియాల జనరల్‌ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి లక్షాల అవరోధాలపై లోతైన అధ్యయనం చేసి కూలంకశంగా చర్చించారు. ఓవర్‌ బర్డెన్‌ తొలగింపును మరింత వేగవంతం చేయాలని, ఉత్పత్తి లక్ష్యాల సాధన, బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సెఇండి మేనేజర్లను ఆదేశించారు. ప్రతి ఏరియా జిఎం తన పరిధిలోని అన్ని గనులు, రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలు, బొగ్గు రవాణా లక్ష్యాలు సాధించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, ప్రాజెక్టు)జె.పవిత్రన్‌కుమార్‌, డైరెక్టర్‌ పిఅండ్‌పి బి.భాస్కర్‌రావు, డైరెక్టర్‌ ఆపరేషన్‌ చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ ఇఅండ్‌ఎం ఎస్‌.శంకర్‌, జిఎం కిషన్‌రావు, జిఎం నాగయ్య, జిఎం మెటీరియల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ టి.నాగేశ్వర్‌రావు,జిఎం(సిఎం) వై.రాజేశ్వర్‌రెడ్డి, జిఎం (యుజిమైన్స్‌) టి.వెంకటేశ్వర్‌రావు, జిఎం ఓసి మైన్స్‌ వైజికె మూర్తి తదితరులు పాల్గొన్నారు.