రైళ్లలో చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

Arrested 1
Arrested

హైదరాబాద్‌: బీహార్‌ రాష్ట్రం నుండి హైదరాబాద్‌ నగరానికి వచ్చి రైలు ప్రయాణీకులను టార్గెట్‌ చేసుకొని మెడలో, బ్యాగుల్లో ఉన్న నగలను తస్కరిస్తున్న ముఠా గురించి రైల్వే పోలీసులు గుర్తించారు. ముఠాలో ఒకరిని అరెస్ట్‌ చేసి రూ.2లక్షల 20వేల ఖరీదు చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకోగా ముఠాలో నల్గురు వ్యక్తులు పరారయ్యారు. రైల్వే ఎస్పీ అశోక్‌ కుమార్‌ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ నుండి వైజాగ్‌ ప్రయాణీంచే జన్మభూమి, ఎల్టీటిటి తదితర ఎక్స్‌ప్రెస్‌ రైలు బళ్లలో మహిళల మెడలోని మంగళసూత్రాలు, బ్యాగులో ఉంచిన వస్తువులు కూడా మాయమైతున్నట్లు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎస్పీ అశోక్‌ కుమార్‌, డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌, సీఐ చంద్రయ్యలను సమావేశపరిచి ఈ నేరాలను ఏలాగైనా అరికట్టాలని నేర పరిశోధనలో ఆరితేరిన ఎస్‌ఐ ప్రమోద్‌ కుమార్‌ బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ బృందం జరిపిన కృషి ఆధారంగా ఈ నేరాలకు పాల్పడుతోన్న ముఠా సభ్యుల పేర్లు, వివరాలను తెలుసుకోగలిగారు. వారిలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన మరియోపార్‌ గ్రామానికి చెందిన జానో మండల్‌(28)ను అరెస్ట్‌ చేసి ఏడున్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసకున్నారు. కాగా, ఈ ముఠాలో ముఖేష్‌ కుమార్‌, కిషన్‌ కుమార్‌, దీపక్‌ కుమార్‌, రేవణ్‌ కుమార్‌ నల్గురు పరారీలో ఉన్నారు. వారిని కూడా అరెస్ట్‌ చేసి వారి నుండి కూడా చోరీ రికవరీ సొత్తు చేస్తామని అధికారులు తెలిపారు.