రైలు ఢీకొని ఇద్దరు మృతి

 

railway track

ఖమ్మం : రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నగరంలోని మొండిగేటు వద్ద రైలు ప్రమాదం సంభవించింది. రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.