రైతు సమన్వయ సమితులు..తెరాస కమిటీలు: ఉత్తమ్‌

tpcc chief chief uttam
tpcc chief chief uttam

హైదరబాద్‌: తెరాస ప్రభుత్వంపై టీపీసీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితులు తెరాస కమిటీలు అని, వీటిని నిరసిస్తూ
ఈ నెల 11న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన
చెప్పారు.రైతులకు రూ.నాలుగువేలు సాయంగా ఇచ్చే విషయంలో తాము వ్యతిరేకం కాదన్న ఆయన ఆ
డబ్బును తెరాస నేతల ద్వారా ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రైతులకు అండగా నిలిచేందుకు తాము రైతు
సంరక్షణ సమితుల్ని ఏర్పాటు చేయనున్నామని, జీవో నెం.39ని రద్దు చేసే విషయంలో న్యాయస్థానాన్ని
ఆశ్రయించేందుకు పార్టీలో చర్చిస్తున్నామని, మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం
తీసుకుంటామని తెలిపారు. రైతు కమిటీల ద్వారా ప్రభుత్వ ఆర్థిక,రెవెన్యూ లావాదేవీలను నిర్వహించడం
రాష్ట్రంలో ఎవరికి సమ్మతమైన విషయం కాదని ఉత్తమ్‌ మండిపడ్డారు.