రైతు బీమాకై మంత్రి పర్యటన

Minister Pocharam Srinivas reddy
P. Srinivas reddy

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అగష్టు నుండి ప్రారంభించబోతున్న రైతు బీమా పథకం అమలుపై క్షేత్ర సాథయిలో సమీక్ష కోసం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. జూన్‌ 18వ తేదీ నుండి మూడు రోజుల పాటు హెలికాప్టర్‌లో జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ సమావేశాల్లో మంత్రితోపాటు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొంటారు. ప్రతీ రోజు రెండు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీమాపై అవగాహన సమావేశాలను నిర్వహిస్తారు. ఇందులోభాగంగా ఈనెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు కరీంనగర్‌, మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్‌లో రైతు బీమా అవగాహనా సమావేశాలు జరుగుతాయి. అలాగే జూన్‌ 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఖమ్మం, మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌ జిల్లా హన్మకొండలోను, 20వ తేదీన ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్‌, 2 గంటలకు నల్లగొండలో సమీక్ష సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ రైతు సమన్వయ సమితి సమన్వయకర్త, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, జిల్లా రైతు సమన్వయ సమితి సబ్యులు పాల్గొంటారు. అంతేకాకుండా జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఆయా సమావేశాల్లో రైతు బంధు జీవిత బీమా సపథకంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. రైతుల నుండి ఏ విధంగా వివరాలు సేకవరించాలి, నామినేషని పేరు, పత్రాలను కేంద్ర కార్యాలయాలకు పంపడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు.