రైతు కమీషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కాలయాపన: బిజెపి నేత నల్లు

Nallu Indrasena reddy
Nallu Indrasena reddy

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలను, వివాదాల పరిష్కార నిమిత్త మూడు నెలల్లోగా కమీషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలంటూ బీజెపీ నేత నల్లు ఇంద్రాసేనా రెడ్డి దాఖలు పిల్‌పై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. రైతు కమీషన్‌ ఎంత గడువులోపు ఏర్పాటు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు గతంలో ప్రశ్నింంచింది. మూడు నెలల్లో కమీషన్‌ ఏర్పాటు చేస్తామని సోమవారం హైకోర్టు విచారణలో ప్రభుత్వం నివేదించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమీషన్‌లో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సహా ఐదుగురు సభ్యులు కమీషన్‌లో ఉండాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది. రైతు సమస్యల పరిష్కారానికి కమీషన్‌ అవశ్యకత ఉన్నప్పటికీ విస్మరిస్తుందంటూ ఆ పిల్‌లో ఇంద్రసేనా రెడ్డి కోరారు.