రైతుల‌ను ఆదుకోవాలంటూ 27న ఛ‌లో అసెంబ్లీః ఉత్త‌మ్

TPCC CHIEF UTTAM KUMAR REDDY
TPCC CHIEF UTTAM KUMAR REDDY

హైదరాబాద్: రైతులను ఆదుకోవాలంటూ 27న ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం గాంధీభ‌వ‌న్లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఉత్త‌మ్‌తో పాటు మ‌రో నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో రాష్ట్ర వ్యవసాయరంగం సంక్షోభంలోకి వెళ్లిందని, టీఆర్ఎస్ పాలనా కాలంలో 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, వడ్డీపై అసెంబ్లీలో ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, పంటలకు గిట్టుబాట ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా 15 శాతం తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలన్నారు. పత్తి రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని ఈ సంద‌ర్భంగా వారు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.