రైతుబంధు పథకం తాత్కాలికం: దత్తాత్రేయ

Dattatreya
B. Dattatreya

హైదరాబాద్‌: తెలంగాణలో రైతుబంధు పథకం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అకాల వర్షాలకి దెబ్బతిన్న పంటలకు ఎలాంటి సాయం చేయలేదన్నారు. అర్హులైన వారందరికీ పంట పెట్టుబడి సాయం అందడంలేదని పేర్కొన్నారు. నకిలీ విత్తన కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ కోరారు. రాష్ట్రంలో అతివలపై నేరాలు 12శాతం పెరిగాయని, ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదన్నారు.