రేవంత్‌రెడ్డి మ‌ద్ద‌తుదారులంతా కాంగ్రెస్‌లోకి రావాలిః ఉత్తమ్

TPCC CHIEF UTTAM KUMAR REDDY
TPCC CHIEF UTTAM KUMAR REDDY

హైద‌రాబాద్ః టీటీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో నిర్వహించిన ఆత్మీయులతో ‘మాట-ముచ్చట’ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మద్దతుదారులందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తాను మనవి చేస్తున్నానని, కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను ఆదుకోవడానికి, ప్రజలకు మేలు చేయడానికి రేవంత్ మద్దతుదారులు, అనుచరులు, కార్యకర్తలు కాంగ్రెస్ లోకి రావాలని సవినయంగా మనవి చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, లోక్ సభలో, రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ చేయించిన గొప్పతనం సోనియాదేనని ఉత్త‌మ్ అన్నారు.