రేపు యాదాద్రికి కేసిఆర్‌

kcr, telangana cm
kcr, telangana cm

హైదరాబాద్‌: రాష్ట్ర సియం కేసిఆర్‌ ఆదివారం యాదాద్రికి వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు. ఆలయ విస్తరణ పనులను పర్యవేక్షంచనున్నారు. పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో యాదాద్రి శోభాయమానంగా మారుతున్నది. రాజగోపురాల నిర్మాణం పనులు శిల్పకళావైభవంతో విరాజిల్లుతున్నాయి. ఆర్కిటెక్టు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.